బేగంపేట మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

-

హైదరాబాద్ బేగంపేటలోని మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆదుపులోకి తీసుకొచ్చారు. ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో వెల్డింగ్ చేస్తుండగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.

మంటలను గమనించిన ఆస్పత్రి సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆరో అంతస్తులో చెత్త ఉండటం వల్లే ఒకసారిగా మంటలు అంటుకున్నాయని ప్రాథమికంగా నిర్థారించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version