తెలంగాణపై వివక్షతో కేంద్రం దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది: కేటీఆర్

-

తెలంగాణపై వివక్షతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బల్క్‌డ్రగ్ పార్క్‌ కేటాయింపులో రాష్ట్రానికి మొండి చేయి చూపారన్నారు. తెలంగాణకు బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌ను కేటాయించాలని డిమాండ్‌ చేసిన కేటీఆర్.. ఈ మేరకు కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయకు లేఖ రాశారు.

బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటులో హైదరాబాద్ ఫార్మాసిటీ అత్యంత అనుకూలంగా ఉందని వివరించారు. భూ సేకరణ, పర్యావరణ అనుమతులతో ఫార్మాసిటీ సిద్ధంగా ఉందని చెప్పారు. మాస్టర్ ప్లానింగ్‌తో సిద్ధంగా ఉన్న ఫార్మాసిటీని కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో అర్థం కావట్లేదని కేటీఆర్ విమర్శించారు.

 

అమరవీరుల స్మారకాన్ని ఈ ఏడాది చివర్లోగా ప్రారంభిస్తామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. స్మారకం సిద్ధమవుతోందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. సచివాలయం ఎదుట లుంబినీపార్కు పక్కన విశాలంగా అమరవీరుల స్మారకాన్ని నిర్మిస్తున్నారు. ప్రధాన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం స్టీల్ క్లాడింగ్ పనులు కొనసాగుతున్నాయి. అనంతరం వెల్డింగ్ సహా ఇతర పనులు పూర్తి చేయాల్సి ఉంది. అమరులకు ఎల్లప్పటికీ రుణపడి ఉంటామని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version