Breaking : ములుగులో భారీ అగ్నిప్రమాదం

-

ములుగు జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. ములుగు ఏరియా ఆసుపత్రి సమీపంలోని గంగిశెట్టి శ్రీనివాస్ ఐరన్ హార్డ్‌వేర్ షాపులో మంగ‌ళ‌వారం రాత్రి విద్యుత్‌ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెల‌రేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు
గుర‌య్యారు. అయితే.. షాపు వెనకాల ఉన్న స్టాక్ పాయింట్ లో అగ్నికీలలు ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చిన‌ట్టు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న‌ ఫైర్ స్టేషన్ అధికారులు, సిబ్బందితో వ‌చ్చి మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

అటు పోలీసు అధికారులు కూడా వెంటనే స్పందించారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా ములుగు ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున‌ జనాలు చేరుకోవడంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి ములుగు ఏఎస్పీ సుధీర్ రామ్ నాథ్‌ చేరుకొని ప‌ర్య‌వేక్షించిన‌ట్టు స‌మాచారం. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version