షాకింగ్: ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్‌ కే భయమా..!!

-

బాలీవుడ్  హీరోయిన్ కంగనారనౌత్‌ గురించి మీడియా తో టచ్ ఉన్నవారికి పరిచయం లేదు. ఆమె పేరు లేకుండా ఏ ఒక్క రోజు కూడా వార్తలు రావంటే అతిశయోక్తి కాదు. ఆమె ప్రతిభతో మరియు వివాదాలతో మీడియాలో రోజూ నానుతూ ఉంటారు. ఆమె ఇప్పుడు భారత దేశంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. అలాంటి ఫైర్ బ్రాండ్ కు కూడా భయం పడే సందర్బాలు ఉన్నాయట.

ఒక ఇంటర్వ్యూ సందర్బంగా  ఆమె తాను భయపడే సంఘటన గురించి చెప్పుకొచ్చింది . గతంలో ఒకసారి కొంత మంది  తన సోదరిపై యాసిడ్ దాడి చేశారని దానితో ఆమెకు చాలా సార్లు సర్జరీ చేయాల్సి వచ్చిందని చెప్పింది. ఆ సంఘటన తో, ఆమె మానసికంగా శారీరకంగా చాలా కృంగిపోయిందని, ఇది జరగడం వల్ల మా ఇంట్లో అందరం మనశ్శాంతి లేకుండా గడిపామని ,అందుకే తన పక్క నుంచి ఎవరైనా వెళ్తున్నా కూడా తనపై యాసిడ్ దాడి చేస్తారేమోనని తాను ఎప్పుడు భయపడుతూనే ఉంటానని తన భయానికి కారణం చెప్పుకొచ్చింది.

ఇక సినిమాల విషయం కు వస్తే గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి  సినిమా సీక్వెల్ లో రజనీ కాంత్ కు బదులుగా రాఘవ లారెన్స్‌ హీరోగా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో జ్యోతిక చేసిన పాత్రకు మంచి ప్రశంశలు వచ్చాయి.తాజాగా సీక్వెల్ లో కథానాయికగా బాలీవుడ్‌ తార కంగనారనౌత్‌ ను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమా తో ఆమె భయపడుతుందో , భయపెడుతోందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version