జలపాతం అంటేనే కిందకి దూకే నీటి ధారలు. మరి నీరెక్కడైనా నిప్పులు కక్కుతుందా? కక్కదుగా.. కానీ అక్కడ నీళ్లు.. నిప్పులు కక్కుతాయి. ఈ అద్భుతాన్ని చూడాలంటే కాలిఫోర్నియా లోని `హార్స్ టెయిల్` జలపాతం దగ్గరకు వెళ్లాల్సిందే. అయితే ఎప్పుడు పడితే అప్పుడు వెళితే లాభంలేదు. ఉత్తర అమెరికా ఖండంలో ప్రతి ఏటా కేవలం రెండు వారాలు మాత్రమే అవకాశం. ఆ రోజుల్లో సూర్యుడు అస్తమించేటప్పుడు కొద్ది క్షణాల పాటు నీళ్లన్నీ కిందికి దూకుతున్న మంటల్లా మారిపోతాయి.
అయితే సమాచారం ప్రకారం 1960 నాటి మాట. ఇది అసలు జలపాతం కాదు. మానవుడు సృష్టించిన అభూత కల్పన. ‘యోసేమైట్’ పార్క్‌లో ఎత్తైన శిఖరాలపై నుంచీ మందుగుండు సామాగ్రిని పేల్చి – గలగల దుమికే అగ్ని శిఖల్ని దొర్లించటం ఇక్కడి ప్రత్యేకత. గ్లేసియర్ పాయింట్ మొదలుకొని పేల్చే ‘ఫైర్ వర్క్స్’ అనతికాలంలోనే ప్రాచుర్యం పొంది ఉన్నట్టుండి అదృశ్యమై పోవటానికి కారణం – ఇది ప్రమాదభరితమైన అంశం కావటమే. అడపాదడపా ‘యోసేమైట్’ పార్క్ వచ్చి వెళ్లే సందర్శకులను మరింత ఆకర్షించటానికి ఈ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు.
సూర్య కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో పడేటప్పుడు జరిగే వింత ఇది. అందుకే దీన్ని “పైర్ ఫాల్స్”ని కూడా అంటారు. యెసెమెటీ నేషనల్ పార్క్‌లోని హార్స్ టెయిల్ జలపాతం ఫిబ్రవరి నెలలో కొన్ని రోజులు మాత్రమే అగ్నిపర్వతం నుంచి జాలువారే లావాను తలపిస్తుంది. దీన్ని వీక్షించేందుకు పర్యాటకులు వెల్లువలా తరలివస్తారు.ఇంతకీ అదెలా అంటే.. సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ కాంతి జలపాతంపై పడి.. నారింజ రంగులో నీళ్లు మెరుస్తాయి. దాని వల్ల లావాలాంటి ఎఫెక్ట్ వస్తుంది. ఈ కొండ ప్రపంచంలోనే అతి పెద్ద గ్రానైట్ కొండ. దీని ఎత్తు సుమారు 650 మీటర్లు.