రైతులకు శుభవార్త.. ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం..

-

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నేడు తొలి సారి ఏపీ మంత్రి వర్గం సమావేశమైంది. అంతేకాకుండా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకన్నట్లు మంత్రి అంబ‌టి రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి కేబినెట్ భేటీలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ముంద‌స్తుగా వ్య‌వ‌సాయ సీజ‌న్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

ఇందులో భాగంగా గ‌తంలో కంటే ముందుగానే కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను విడుద‌ల చేస్తామ‌ని, గోదావ‌రి డెల్టాకు జూన్ 1న నీటిని విడుద‌ల చేస్తామ‌ని అంబ‌టి పేర్కొన్నారు. కృష్ణా డెల్టాకు జూన్ 10 నుంచి నీటిని విడుద‌ల చేస్తామని మంత్రి అంబటి తెలిపారు. పులిచింత‌ల ప్రాజెక్టు నుంచి జూన్ 10న నీటిని విడుద‌ల చేస్తామ‌న్న అంబటి.. నాగార్జున సాగ‌ర్ నుంచి జూన్ 15 నుంచి నీటిని విడుద‌ల చేస్తామ‌ని వెల్లడించారు. అదే విధంగా రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల నుంచి జూన్ 30 నుంచి నీటిని విడుద‌ల చేస్తామ‌ని పేర్కొన్నారు అంబటి.

Read more RELATED
Recommended to you

Exit mobile version