విశాఖలో త్వరలో తొలి ప్రభుత్వ కార్యాలయం…!

-

విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన తర్వాత తొలి ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు కానుంది. వైజాగ్ మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయం త్వరలోనే ప్రారంభించనున్నారు. నిర్ధిష్ట సమయంలోనే మెట్రోను విశాఖలో పరుగులు పెట్టించాలనే గట్టి పట్టుదలతో ఉంది అధికార యంత్రాంగం. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖలో మెట్రో రైలు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రాజెక్టు పర్యవేక్షణకు అనుకూలంగా ఉండేందుకు మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయం త్వరలో ప్రారంభించనుంది.

మెట్రో కార్యాలయం కోసం నగరంలోని ఎల్.ఐ.సీ.బిల్డింగ్ మూడో అంతస్ధును ఎంపిక చేసింది సర్కారు. ఆఫీస్ నిర్వహణకు అనుగుణంగా మార్పులు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈనెలాఖరు నాటికి మెట్రోరైల్‍ రీజనల్ ఆఫీస్ ప్రారంభం అవుతుందని అధికారుల అంచనా. ప్రాజెక్ట్ గ్రౌండింగ్ చేసే సమయం సమీపించడంతో ఇకపై విశాఖ నుంచే కార్యకలాపాలు సాగించడం సరైందని అధికారులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version