రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశాలన్నీ గజగజ వణికిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. కానీ.. ముంబయిలో ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా ముంయిలో కేసులు మరీ పెరుగుతున్నాయి. కానీ ఆసియాలోనే అతిపెద్ద మురిగివాడగా పేరొందిని ధారవిలో గత 24 గంటల్లో ఒక్కకేసు కూడా నమోదు కాకపోవడం విశేశం.
ఇప్పటిదాక ధారవిలో 3,788 మంది కరోనా బారిన పడినట్లు సమాచారం. అక్కడే ప్రçస్తుతం 12 యాక్టివ్ కేసులే ఉన్నాయి.కరోనా కట్టడిలో ధారవిని నగరవాసులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. వీరి కృషిని ఆరోగ్య సంస్థ సైతం అభినందించింది. ట్రేసింగ్ టెస్టింగ్, ట్రాకింగ్ మరియు ట్రీట్‌మెంట్ పద్ధతులను పాటిస్తూ కరోనాను కట్టడి చేసినట్లు అక్కడి వైద్యశాఖ పేర్కొంది.