బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు

-

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు అంటే ఎవ్వరూ నమ్మరని.. ఒక్కటేనని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన అధికారిక ఖాతా ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.  బీఆర్ఎస్ ని బీజేపీ మొదటి  నుంచి కాపాడుకుంటా వస్తుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పై పీఎఫ్ పహారా కేసుకు సంబంధించి సీబీఐ కేసు పెడితే పూర్తిగా కొట్టివేసిందని ఆరోపించారు. అది ఎవ్వరికీ తెలియకుండా చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని వెల్లడించారు. పదేళ్లలో ఒక్కసారి రాష్ట్రపతి అభ్యర్థి అంశంలో బీజేపీని బీఆర్ఎస్ విభేదించిందని తెలిపారు.

బీజేపీ తెచ్చిన ప్రతీ చట్టం.. ప్రతీ బిల్లుల అమలు సందర్భంలోనూ కేంద్రంలోని బీజేపీకి బీఆర్ఎస్ మద్దతూ ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్, బీజేపీ మధ్య రాజకీయ రహస్య ఒప్పందం మొదటి నుంచి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందం చేసుకున్నాయని కాంగ్రెస్ ముక్త్ ప్రోగ్రామ్ కి బీఆర్ఎస్ గతంలో సహకరించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని ఒకరినొకరు సహకరించుకుంటున్నారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ ను బీజేపీ కాపాడుతుందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version