ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే సెగలు ఎక్కువ!

-

ప్రజా వ్యతిరేకత…ఇది గాని ఒక్కసారి వస్తే…దాన్ని మార్చుకోవడం ఏ ఎమ్మెల్యేకైనా కష్టం…ఆ ప్రజా వ్యతిరేకతని తగ్గించుకుని మళ్ళీ ఎన్నికల్లో గెలిచి బయటపడటం ఈజీ కాదు…ఇప్పుడు అధికార వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలకు ఇదే పరిస్తితి ఉంది. అందుకే జగన్ ముందే చెప్పేశారు…ఎప్పుడు ప్రజల్లో ఉంటూ…వారికి అండగా ఉంటే ప్రజా మద్ధతు పెరుగుతుందని, అలా మద్ధతు పెంచుకోకపోతే ఎమ్మెల్యేలకే కాదు…పార్టీకి కూడా నష్టం జరుగుతుందని.

కానీ జగన్ చెప్పినా సరే కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజా మద్ధతు పెంచుకోవడంలో విఫలమైనట్లే కనిపిస్తున్నారు. ఇక అలాంటివారికి సీటు ఇవ్వనని జగన్ ముందే చెప్పేశారు. అయితే తాజాగా పీకే టీం సర్వే అంటూ ప్రచారం జరుగుతుంది…ఈ సర్వే ప్రకారం దాదాపు 70 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వారికి మళ్ళీ సీటు ఇస్తే గెలవడం కష్టమని, వారిని మార్చేయాలని పీకే టీం…జగన్‌కు సూచించినట్లు తెల్సింది.

అయితే ఒకేసారి 70 మందిని పీకేయడం చాలా కష్టమైన పని…కాబట్టి అందులో సగం మందికైనా సీట్లు దక్కే అవకాశాలు లేవని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..సీనియర్ ఎమ్మెల్యేలు కంటే ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిపైనే వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలవడంతో ప్రజలకు పనులు చేసి పెట్టడం కంటే…సొంత పనులని చక్కదిద్దుకునే పనిలో ఎక్కువ ఉండి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు…అందుకే వ్యతిరేకతని మూటగట్టుకున్నారని చెబుతున్నారు.

ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న లిస్ట్‌లో…ఉండవల్లి శ్రీదేవి, కిలారు రోశయ్య, విడదల రజిని, అన్నాబత్తుని శివకుమార్, వసంత కృష్ణప్రసాద్, సింహాద్రి రమేష్, మధుసూదన్ రెడ్డి, గొర్లే కిరణ్ కుమార్, కడుబండి శ్రీనివాసరావు, చెట్టి ఫాల్గుణ, భాగ్యలక్ష్మీ, ధనలక్ష్మీ,  జ్యోతుల చంటిబాబు, పుప్పాల వాసుబాబు, ఎం‌ఎస్ బాబు, కంగాటి శ్రీదేవి, శ్రీధర్ రెడ్డి, ఉషశ్రీ చరణ్, ఆర్థర్ లతో పాటు ఇంకా పలువురు ఫస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నారు…గెలుపు పక్కన పెడితే నెక్స్ట్ వీరిలో కొందరికి సీట్లు కూడా డౌటే అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version