వామ్మో.. ఈ చేపకు రెండు నోర్లు ఉన్నాయ్..!

-

భూమిపై ఉండే ఏ జీవికైనా సరే సాధారణంగా ఒకే ఒక్క నోరు ఉంటుంది. కానీ కొన్ని సార్లు కొన్ని జీవులు పలు కారణాల వల్ల అవయవలోపంతో జన్మిస్తుంటాయి.

భూమిపై ఉండే ఏ జీవికైనా సరే సాధారణంగా ఒకే ఒక్క నోరు ఉంటుంది. కానీ కొన్ని సార్లు కొన్ని జీవులు పలు కారణాల వల్ల అవయవలోపంతో జన్మిస్తుంటాయి. దీంతో అలాంటి జీవులకు నోరు సరిగ్గా నిర్మాణం కాకపోవడమో, లేదా ఒకటి కన్నా ఎక్కువ నోళ్లు ఉండడమో జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే సరిగ్గా అదే కోవకు చెందిన ఓ చేప ఒక జంటకు చిక్కింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

అమెరికాలోని న్యూయార్క్‌కు సమీపంలో ఉన్న ఓ సరస్సులో డెబ్బీ గెడ్డెస్ అనే ఓ మహిళ తన భర్తతో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లింది. అయితే వారికి అనుకోకుండా ఒక చేప చిక్కింది. దానికి రెండు నోర్లు ఉండడం విశేషం. అయితే ఆ చేపను ఫొటో తీసుకుని వెంటనే దాన్ని మళ్లీ సరస్సులోకే వదిలి పెట్టామని ఆ జంట తెలిపింది. కాగా ఆ జంట ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అయితే ఆ చేపకు ఇలా రెండు నోర్లు ఉండడంపై బయాలజిస్టులను అడగ్గా.. సాధారణంగా పుట్టుకలో లోపాలు ఉండడం వల్లే ఇలా జరుగుతుంటుందని, అవయవాలు సరిగ్గా ఏర్పడకపోతే ఇలా జరుగుతుంటుందని వారు తెలిపారు. ఏది ఏమైనా ఇప్పుడీ రెండు నోర్ల చేప మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version