ప్రేమానురాగాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే.. ఈ 5 వాస్తు చిట్కాలను పాటించండి..!

-

Vastu tips: ప్రతీ ఒక్కరు కూడా వైవాహిక జీవితంలో ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. మీ ప్రేమ కూడా రోజూ పెరుగుతూనే ఉండాలని మీరు కోరుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇవి పాటించాలి.. వాస్తు ప్రకారం అనుసరించడం వలన భార్యా భర్తల మధ్య బంధం.. అలాగే ప్రేమలో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఒకరితో ఒకరు ఉండవచ్చు. మనం ఇష్టపడే వ్యక్తులు నుంచి అదే విధంగా ప్రేమ వచ్చిందంటే ఇక జీవితానికి మరి ఏమి అక్కర్లేదు. ప్రేమతో హాయిగా మీరు కూడా ఉండాలని అనుకుంటే వాస్తు చిట్కాలను అనుసరించండి.

 

వాస్తు ప్రకారం పెళ్లి అయిన వాళ్ళ గది ఎప్పుడూ కూడా ఉత్తరం, దక్షిణం లేదా ఈశాన్యం వైపు ఉంటే మంచిది. ఈ దిశలో బెడ్ రూమ్ ఉండడం వలన వారికి ఎంతగానో కలిసి వస్తుంది. అలాగే వాస్తు ప్రకారం భార్య భర్తల గది లేదా ప్రేమికుల గది ఎప్పుడూ కూడా పింక్, ఎరుపు, పర్పుల్ రంగులతో ఉంటే మంచిది. దీని వలన ప్రేమానురాగాలు బలపడతాయి. కొన్ని సింబల్స్ పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి.

లవ్ బర్డ్స్, మేండరిన్ డక్స్ వంటి వాటిని మీరు నైరుతి వైపు పెట్టడం వలన ప్రేమ ఎప్పుడూ కూడా పుడుతూ ఉంటుంది. సంతోషంగా ఉండడానికి అవుతుంది. పనికిరాని సామాన్లు, చెత్తాచెదారం వంటి వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. బెడ్ రూమ్ లో టీవీ, కంప్యూటర్ ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా చూసుకోండి. ఇలా ఈ తప్పులు చేయకుండా మీరు ఫాలో అయినట్లయితే కచ్చితంగా వాస్తు ప్రకారం సంతోషంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version