రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఆంధ్రాలో విజయవాడ, గుంటూరు జిల్లాల్లో తుపాన్ ప్రభావం తీవ్రంగా పడింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఖమ్మం జిల్లలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో చాలా వరకు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించి వారికి అన్ని సహాయక సహకారాలు అందిస్తామన్నారు. ఇక విజయవాడలోనూ సీఎం చంద్రబాబు రాత్రంతా బోటు పర్యటించి నష్టాన్ని అంచనా వేయడంతో పాటు బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
అయితే, నెమ్మదిగా వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో జనాలు పునారావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆప్రాంతం అంతా బురదతో నిండిపోయి ఉంటుంది. దీంతో విషజ్వరాలు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.ప్రభుత్వాలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో అంతా సెట్ అయ్యేవరకు దగ్గరుండి పర్యవేక్షించాలని, వైద్య సదుపాయం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.