పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపిలో చేరతారని బీఆర్ఎస్ నాయకులు తరచుగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. చోటా బాయ్ బడా బాయ్ అంటూ బిఆర్ఎస్ నేతలు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారు. ఇక నిన్న మెదక్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి బిజెపిలోకి చేరుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ ఆరోపణలకు ఊతమిస్తూ…పక్కపక్కనే మోడీ, రేవంత్ రెడ్డి ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి.తీన్మార్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ డీసీఎంకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మోడీ ఫోటో పక్కన సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉంది.దీంతో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నాడా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అనుకుంటున్నారు.