కరోనా వైరస్ నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా విమాన రంగం భారీగా దెబ్బ తింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా వైరస్ తీవ్రత నేపధ్య౦లో ఏ దేశం లో కూడా విమానాలు తిరిగే పరిస్థితి దాదాపుగా లేదు. దీనితో ఇప్పుడు విమానయాన సంస్థలు భారీ నష్టాల్లో ఉన్నాయి. విమాన నిర్వహణ ఖర్చులు, విమానయాన సిబ్బందికి జీతాలు, ఇతరత్రా ఖర్చులు భారీగా పడుతున్నాయి సంస్థల మీద.
ఇప్పటికే మన దేశంలో విమానయాన రంగం చాలా వరకు నష్టాల్లోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దీనితో ఇప్పుడు విమాన టికెట్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపు 20 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే టికెట్ కి 500 నుంచి పెరిగే అవకాశాలు దేశీయంగా ఉన్నాయని సమాచారం.
ఇప్పటి వరకు ప్రయాణికులను పెంచుకోవడానికి అనేక ఆఫర్లు ప్రకటించిన విమానయాన సంస్థలు ఇప్పుడు మాత్రం ఆఫర్లు ఇచ్చే స్థితిలో లేవు అనే విషయం తెలుస్తుంది. ఇక కేంద్రం కూడా విమాన టికెట్ ధరలను పెంచే విషయంలో అడ్డు చెప్పవద్దు అని భావిస్తుంది. ఇప్పుడు పునరుద్దరించే అవకాశాలు దాదాపుగా లేవు అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. దీనితో మరో రెండు మూడు నెలలు విమానాలు తిరిగే పరిస్థితి లేనట్టే.