శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు భారీగా తగ్గిన వరద

-

గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని జలాశయాలు నిండుకుండాల్లా మారాయి. అయితే.. రెండు రోజుల నుంచి వర్షాలకు తగ్గుముఖం పట్టడంతో.. ప్రాజెక్ట్‌లకు వరద నీరు ఉధృతి తగ్గింది. ఈ నేపథ్యంలోనే నిజమాబాద్‌ జిల్లా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు భారీగా వరద తగ్గింది. దీంతో అధికారులు 27 గేట్ల మూసివేశారు. 9 గేట్ల ద్వారా మాత్రమే 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 44920 క్యూసెక్కులు ఉంది. అయితే.. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1087 అడుగులు ఉంది. అలాగే.. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 76 టీఎంసీలుగా ఉంది.

ఇదిలా ఉంటే.. కర్నూలు సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం పోటెత్తింది. ఇన్ ఫ్లో 1,60,179 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 1,59,674 క్యూసెక్కులుగా ఉంది. ఇప్పటికే అధికారులు 27 గేట్లను ఎత్తి ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా, ప్రస్తుత 0.48 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనితో పాటు నంద్యాల శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 3,67,698 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 12,714క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 848.30 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 76.3162 టీఎంసీలుగా ఉంది. అయితే.. తెలంగాణ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version