కరోనా వైరస్ మహమ్మారై అందర్నీ పట్టి పీడించింది. ఈ మహమ్మారి కారణం గానే ఈసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా లాల్ బాగ్ ఉద్యానవన గాజు మందిరం లో పుష్ప ప్రదర్శనను రద్దు చేయడం జరిగింది. అయితే మైసూరు ఉద్యాన కళాశాల, ఉద్యాన వనాల శాఖ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియ జేయడం జరిగింది.
ప్రతీ ఏటా చేసే ఈ పుష్ప ప్రదర్శన ఈసారి ఇక లేనట్టే. మామూలుగా అయితే ప్రతీ సంవత్సరం ఈ పుష్ప ప్రదర్శన ని జనవరి ఎనిమిదో తేదీ నాడే మొదలు పెట్టడం ఆనవాయితీ. కొన్ని ఏళ్ల నుండి లాల్ బాగ్ ఉద్యానవన గాజు మందిరం లో పుష్ప ప్రదర్శనను చేస్తూ వచ్చారు. ఈ ప్రదర్శన లో వివిధ రకాల పుష్పాలను ఏర్పాటు చేసేవారు. వీటిని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం లక్షల మంది వచ్చే వారు.
ఇది ఇలా ఉంటే ఆగస్టు 15 న కరోనా లాక్‌డౌన్ సమయం లోనూ కూడా ఇక్కడ పుష్ప ప్రదర్శనను రద్దు చేసిన సంగతి కూడా మనకి తెలిసినదే. అయితే ఇప్పుడు రాబోయే గణతంత్ర దినోత్సవం కి కూడా ఈ పుష్ప ప్రదర్శన లేదు. ఈసారి గణతంత్ర వేడుకలకూ ప్రదర్శన రద్దు చేస్తున్నట్టు ఉద్యాన వనాల శాఖ అధికారులు తెలియ జేయడం జరిగింది.