ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే P4 పథకంలో భాగంగా వేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు అన్ని రంగాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకుడు మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు దృష్టి సారించామని పేర్కొన్నారు. మందులు, వసతి విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించామని.. ఈ మేరకు ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.