మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి అవి వెంట తీసుకెళ్లొచ్చు..

-

హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణిస్తున్న వారు మెట్రో స్టేషన్‌ నుంచి తమ తమ ఆఫీసులకు, ఇండ్లకు వెళ్లాలంటే క్యాబ్‌లో, ఆటోనో ఆశ్రయించాల్సి వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పింది మెట్రో సంస్థ. ఆఫీస్‌, ఇతర ప్రాంతాలకు మెట్రోలో ప్రయాణించే వారు ఇక నుంచి మడత పెట్టే సైకిళ్లను తమవెంట తీసుకువెళ్లవచ్చని తెలిపింది. ఈ మేరకు మెట్రో రైలు సంస్థ అనుమతి ఇచ్చింది.

అయితే సైకిల్‌ బ్యాగు సైజ్‌ 60/45/25 సెం.మీలు.. బరువు 15 కిలోలకు మించకుండా ఉండాలని నిబంధన విధించింది. ఈ సైకిల్‌కు ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు. ప్రయాణికులు మెట్రో దిగిన తర్వాత తమ గమ్యస్థానాలు చేరేందుకు ఇతర ప్రయాణ సాధనాలపై ఆధార పడకుండా సైకిళ్లపై వెళ్లడాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. గతేడాది ఓ ప్రయాణికుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఈ వివరాలు చెప్పామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version