టాలీవుడ్‌లో ఫోక్‌ సాంగ్స్‌ హంగామా

-

ఇన్నాళ్లు వెస్ట్రన్ స్టైల్, మోడ్రన్‌ మ్యూజిక్‌ అంటూ సాగిన తెలుగు సినిమా ఇప్పుడు ఫోక్‌కి కూడా ప్రియారిటీ ఇస్తోంది. ఆడియన్స్‌ టేస్ట్‌ని క్యాచ్ చేస్తూ చిన్న హీరోలు, పెద్ద స్టార్లు అంతా జానపదాలకి స్టెప్పులేస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో ఇప్పుడు ఫోక్యులర్‌ సాంగ్స్‌ పెరిగిపోతున్నాయి.

మిక్కీ.జే.మేయర్ ఎక్కువగా మెలడీ సాంగ్స్‌ కంపోజ్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు ఆడియన్స్‌ ఫోక్‌ సాంగ్స్‌కి బాగా కనెక్ట్‌ అవుతున్నారు. అందుకే ఈ మెడ్లీ మ్యూజిక్‌ డైరెక్టర్ కూడా ‘శ్రీకారం’ కోసం ఫోక్‌ స్టైల్‌లో ‘భలేగుంది బాలా’ అనే పాట కంపోజ్‌ చేశాడు. పెంచల్‌ దాస్‌ రాసి, పాడిన ఈ పాటకి నెటిజన్స్‌ నుంచి సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. డిజిటల్‌ వరల్డ్‌లో ఇప్పుడు హంగామా చేస్తోన్న పాట ‘నాదీ నక్కిలీసు గొలుసు’. ఎన్నాళ్ల నుంచో జనాల నోళ్లలో ఉన్న ఈ పాటని వెండితెరపైకి తీసుకొచ్చాడు రఘు కుంచె. ‘పలాస 1978’ సినిమాలో ఈ పాటని రీ క్రియేట్‌ చేశాడు రఘు కుంచె. సోషల్‌ మీడియాలో ఈ పాట సూపర్‌ హిట్‌ అయ్యింది. ముఖ్యంగా టిక్‌టాక్‌లో అయితే ట్రెండ్‌ సెట్‌ చేసింది నక్కిలీసు గొలుసు పాట.

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఫోక్‌ ట్రెండ్‌ని ఫుల్లుగా క్యాష్ చేసుకుంటున్నాడు. అరవింద సమేత నుంచి ఫోక్ సాంగ్స్‌ని రిపీట్‌ చేస్తున్నాడు త్రివిక్రమ్. అరవింద సమేతలో రాయలసీమ ఫోక్‌ స్టైల్‌లో రెడ్డమ్మ పాట పెడితే, ‘అల వైకుంఠపురములో’ ఉత్తరాంధ్ర స్టైల్‌తో ‘సిత్తరాల సిరపడు’పాట కంపోజ్ చేయించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version