ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ లను వాడుతున్నారు. మెసిజింగ్ యాప్ లలో ఒకటైన వాట్సప్ ను ప్రతి ఒక్కరూ వాడతారు.ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రాచుర్యం పొందింది.ఇందులో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు..అయిన డేటా లీక్ అవుతూ వస్తుంది..దాంతో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు.
అయితే తాజాగా వాట్సాప్ నుంచి భారీగా డేటా లీక్ అయ్యిందన్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు రావడంతో యూజర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ వ్యవహారంతో వాట్సాప్ సెక్యూరిటీ ప్రశ్నార్థకంగా మారింది. అయితే వాట్సాప్ మనకు అందించిన కొన్ని సెక్యూరిటీ ఫీచర్ల సహాయంతో మన డేటాను భద్రంగా ఉంచుకోవచ్చు. మీ వాట్సాప్ ఖాతా మరింత సెక్యూర్‌గా మారాలంటే ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..
*. వాట్సాప్ అందించిన మరో సెక్యూరిటీ ఫీచర్ ‘టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్’. దీనిద్వారా మీరు ఎదుటి వ్యక్తితో చేస్తున్న సంభాషణను ఎవరూ చూడలేరు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి ముందుగా మెనులోకి వెళ్లాలి అనంతరం సెట్టింగ్స్‌పై క్లిక్ చేసి అకౌంట్ సెక్షన్‌లోకి వెళ్లాలి. అనంతరం టూ స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.
*. సెక్యూరిటీ నోటిఫికేషన్‌ను ఆన్ చేసుకోవడం ద్వారా కొత్త డివైజ్‌లోకి వాట్సాప్ ఓపెన్ చేయగానే సెక్యూరిటీ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం సెట్టింగ్ ఓపెన్ చేసి.. సెక్యూరిటీ నోటిఫికేషన్స్‌పై క్లిక్ చేసి ‘షో సెక్యూరిటీ నోటిఫికేషన్’ను ఎంచుకోవాలి.
*.క్లౌడ్ బ్యాకప్స్‌ను కూడా ఎన్‌క్రిప్ట్ చేసుకోవాలి. దీనివల్ల క్లౌడ్‌లో స్టోర్ అయిన డేటాను కూడా ఎవరూ యాక్సెస్ చేయలేరు. ఈ ఫీచర్‌ను ఆన్ చేయాలంటే.. సెట్టింగ్స్‌లోకి చాట్స్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం చాట్ బ్యాకప్‌పై క్లిక్ చేసి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌పై ట్యాప్‌చేసి టర్నన్ ఆన్‌ను నొక్కితో సరి. ఇందుకోసం ఓ పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేసుకోవాలి.
*. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..తెలియని వెబ్‌సైట్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు. ఏమాత్రం అనుమానం అనిపించినా సదరు లింక్‌ల జోలికి వెళ్లకూడదు. కొందరు సైబర్ నేరగాళ్లు ఈ లింక్‌లతో యూజర్ల డేటాను చొరీ చేస్తున్నారు.. జాగ్రత్త లేకుంటే మీ అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం..