బ్రేకింగ్‌ : వరంగల్‌ సీపీపై బదిలీ వేటు.. ఆయన స్థానంలో ఏవీ రంగనాథ్‌ని నియామకం

-

వరంగల్ పోలీస్ కమీషనర్‌పై తెలంగాణ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం సీపీగా వున్న తరుణ్ జోషిని బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఏవీ రంగనాథ్‌ని నియమించింది. తరుణ్ జోషిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆకస్మిక బదిలీకి దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది. రంగనాథ్ ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా విధులు నిర్వహిస్తున్నారు. సీపీ తరుణ్ జోషిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఐపీఎస్ ఆఫీసర్​ ఏవీ రంగనాథ్ ను నియమిస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా వస్తున్న ఏవీ రంగనాథ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ నగర ట్రాఫిక్‌ పోలీసు విభాగం జాయింట్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన రంగనాథ్‌ తొలుత గ్రూప్‌-1 అధికారిగా ఎంపికై 2002 నుంచి 2003 వరకు వరంగల్‌ జిల్లా నర్సంపేటలో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. 2006లో కన్ఫర్డ్‌ ఐపీఎ్‌సగా పదోన్నతి పొంది పలు జిల్లాలలో ఎస్పీగా సమర్థవంతగా పనిచేశారు. ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఎస్పీగా, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. రంగనాథ్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సుపరిచితులు కావడంతో ఇక్కడి భిన్న వర్గాల వారు ఆయన రావడాన్ని స్వాగతిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version