బాసర IIIT లో ఫుడ్ పాయిజన్ ప్రభుత్వ నిర్లక్ష్యమే – ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి

-

బాసర ఐఐఐటీలో ఫుడ్ పాయిజన్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి. విద్యార్థులకు చదువుకునే వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు.సమస్యల సుడిగుండంలో బాసర ఐఐఐటీ ఉందన్నారు.ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా IIIT బాసరను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు ప్రవీణ్ రెడ్డి.స్వయంగా విద్యా శాఖ మంత్రి సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించి 20 రోజులైనా పురోగతి శూన్యమని అన్నారు.

బాసర ఐఐఐటి సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి.తరచూ ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు.ఐఐఐటీ బాసర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version