రాష్ట్రంలో ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న గురుకులాల్లో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్న విషయం తెలిసిందే. గురుకులాల్లోని హాస్టల్లో కలుషిత మైన భోజనం పెట్టడం వలన విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికే ఫుడ్ పాయిజన్ ఘటనలో చాలానే వెలుగుచూశాయి.ఇప్పటివరకు ఇద్దరికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వలన ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా రాష్ట్రంలోని మరో గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గురుకుల పాఠశాలలో తాజాగా జరిగిన ఫుడ్ పాయిజన్ వల్ల ముగ్గురు విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం గుడూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.