శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ వద్ద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు శ్రీ చైతన్య సిబ్బంది. గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించిన శ్రీ చైతన్య సెంట్రల్ కిచెన్ లైసెన్స్ నీ శుక్రవారం సస్పెండ్ చేసారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇప్పటికే ఆరు నెలల్లో మూడు సార్లు తనిఖీలు చేస్తే.. మూడు సార్లు నాసిరకం కూరగాయలతో కిచెన్ మెయింటినెన్స్ చేస్తున్నారు. గత జూన్ నెలలో కిచెన్ లోని కూరగాయలను ల్యాబ్ కి పంపితే నాసిరకమని తేల్చారు ల్యాబ్ అధికారులు. శ్రీ చైతన్య విద్యాసంస్థలలో చదివే వేలాది మంది విద్యార్థులకు ఈ సెంట్రల్ కిచెన్ నుంచే ఫుడ్ సరఫరా చేస్తున్నారు సిబ్బంది.
అయితే కిచెన్లో పాడైపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచిన సిబ్బంది.. దాదాపుగా 125 కిలోల ఎక్స్పైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ ని సేకరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. విద్యార్థులకు ఆహారాన్ని అందించడం ఇబ్బంది అవుతుందని.. కిచెన్ ఓపెన్ చేసి పెడతామంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులతో వాగ్వాదానికి దిగారు శ్రీ చైతన్య సిబ్బంది.. నిర్వాహకులు.