సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో 3 నెలల జీతం రూ.9 వేలు అడిగినందుకు స్వీపర్ కొడుకును ఓ కాంగ్రెస్ నేత నడవలేని స్థాయిలో పోలీసులతో కొట్టించాడు. బాధితుడి తల్లి ఓ స్కూల్లో స్వీపర్.. నెల జీతం రూ.3వేలు.. 3 నెలల జీతం రూ. 9వేల చెక్కు మీద సంతకం చేయకుండా నెల రోజులు తిప్పుకొని, ఇదేం అన్యాయమని అడిగినందుకు కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డి పోలీసులతో దాడి చేయించినట్లు సమాచారం.
ఈ ఘటన కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం అల్లీపూర్ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. భీమమ్మ అనే వృద్ధురాలు ప్రాథమిక స్కూల్లో పదేండ్లుగా స్వీపర్‌గా పనిచేస్తున్నది.భీమమ్మకు మూడు నెలలుగా జీతం ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు.నాలుగు నెలల క్రితం భీమమ్మ కోడలు చనిపోయింది. దీంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నామని, నెలకు రూ.3000 జీతాన్ని కూడా ఇవ్వకుండా ఆపితే తాము ఎలా బతకాలని భీమమ్మ కొడుకు ఎల్లయ్య పాఠశాల హెచ్ఎంకు ఫిర్యాదు చేశాడు.
పాఠశాల హెచ్ఎం స్పందించి జీతం చెక్ రాసి, సంతకం చేయమని పాఠశాల చైర్ పర్సన్ వెంకటమ్మకు పంపగా ఆమె కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి చెప్పాడని తిరస్కరించింది.దీంతో ఎల్లయ్య తన తల్లికి ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారని పాఠశాల చైర్ పర్సన్ వెంకటమ్మ, కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డిని అడిగాడు. మమ్మల్ని ప్రశ్నిస్తావా? అంటూ రమేష్ రెడ్డి ఎస్ఐ విజయ్ కుమార్ కు చెప్పగా.. విజయ్ కుమార్ నిజానిజాలు తెలుసుకోకుండా ఎల్లయ్యను పీఎస్‌కు పిలిపించి విచక్షణారహితంగా కొట్టాడు.
తాను ఏ తప్పూ చేయకపోయినా ఎస్ఐ విజయ్ కుమార్ విచక్షణారహితంగా కొట్టాడని..ఎస్ఐ విజయ్ కుమార్ పై, కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఏడుస్తూ తన ఆవేదన తెలిపాడు.
https://twitter.com/TeluguScribe/status/1892064690307575992