వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్లకు ఈ ఆయిల్ రాస్తే చాలు..ఎలాంటి నొప్పి ఉండదు

-

ఈరోజుల్లో కుర్చుని ఉద్యోగాలు చేసుకోవడం వల్ల, అందులోనూ వర్క్ ఫ్రమ్ వల్ల మెడనొప్పి కామన్ గా వస్తుంది. దీంతోపాటు..భుజాల దగ్గర పెయిన్ వస్తుంది. కండరాల్లో నొప్పి వస్తుంది. ఈ భాగాల్లో నొప్పి వస్తే పెయిన్ కిల్లర్స్ వేసుకుని మేనేజ్ చేసుకుని మళ్లీ పని చేసుకుంటాం. కానీ వీటిని కారణం ఏంటి, సహజంగా ఏం చేస్తే తగ్గుతుందో ఈరోజు తెలుసుకుందాం.

కదలకుండా కుర్చోడంవల్ల మజిల్స్ స్టిఫ్ అయిపోయి పెయిన్ వస్తుంది. అలా టైట్ అవడం వల్ల ఒకే భంగిమలో పెట్టినందువల్ల నొప్పులు వస్తాయి. ఇంకా కొన్ని రోజులు గడిస్తే..నెక్ పెయిన్ వస్తుంది..ఆ తర్వాత చేతుల్లో జిమ్ మని లాగడం స్టాట్ అ‌వుతుంది. నొప్పులు వస్తున్నాయని డాక్టర్ దగ్గరకు వెళ్తే మీరు కంప్యూటర్ దగ్గర కుర్చోడం వల్ల వచ్చింది అంటారు. కానీ మన జీవనాధారం అదే కదా.చిన్నప్పటి నుంచి కష్టపడి చదవింది జాబ్ చేసి మన కాళ్లమీద నిలబడటానికే కదా..కదలకుండా కుర్చోవడం వల్ల వచ్చింది అంటే..మరి జాగింగ్ చేస్తానో, ఏదో ఆసనాలు చేస్తానో కంప్యూటర్ ముందు పనిచేయలేం కదా..అలానే కుర్చోవాలి. కానీ ఎవరికి నొప్పి అని చెప్పినా..వచ్చే డైలాగ్..కదలకుండా కంప్యూటర్ ముందు కుర్చోవడం వల్ల అంటారు.

మనం కొన్ని ఎక్సర్ సైజ్ లు చేయటం వల్ల ఈ నొప్పి తగ్గుతుంది. చేతులను బాగా చాపి కదుపుతూ ఉండాలి. నడుమును వంచి చేతులు కలపండి. అలా రెండు చేతులను క్లాక్ వైస్ యాంటి క్లాస్ వైస్ తిప్పండి. ఇలా డైలీ చేస్తుంటే బాడీ మీకు సపోర్ట్ చేస్తుంది.

వ్యాయామాలతోపాటు.. పిప్పర్ మెంట్ ఆయిల్ మార్కెట్ లో దొరుకుతుంది. ఇది మజిల్ రిలాక్స్ కు బాగా పనిచేస్తుంది. పెయిన్ ఉన్న ఏరియాలో ఒకటి రెండు చుక్కలు చాలు. ఎక్కువ రాస్తే మండుతుంది. ఇబ్బందిగా ఉంటే..కాస్త కొబ్బరినూనెను కలపండి. అలా రాసి ఐదు నిమిషాలు ఆగి వేడినీళ్లలో క్లాత్ పిండేసి ఆ క్లాత్ పెట్టండి. హాయిగా ఉంటుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తుంటే..సింపుల్ గా తగ్గుతుంది. స్నానానికి ముందు కూడా ఇలా చేసుకుని వేడి నీళ్లతో స్నానం చేస్తే మంచి రిలీఫ్ ఉంటుంది.

ఎవరికైతే భుజాలకండరాలు నొప్పి ఎక్కువగా ఉందో..వాళ్లు మెడను వెనకు వంచి.. మధ్యాసనం, భుజంగాసనం,ఉస్ట్రాసన్, ధునరాసన్ ఇలాంటి పదినిమిషాలు చేస్తుంటే..చాలు చక్కటి పరిష్కారం. భవిష్యత్తులు ఎప్పటికి ఆ సమస్యలు రాకుండా ఇవి రక్షిస్తాయి. ఎక్కువ గంటల పాటు వర్క్ చేసేవాళ్లు..మీ శరీరం మీకు సహకరించాలంటే..పెయిన్ కిల్లర్స్ వేసుకునే బదులు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సమస్య తగ్గుతుంది. ఆరోగ్యానికి ఎలాంటి హానీ జరగదు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే..కిడ్నీలు దెబ్బతింటాయి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version