‘ఆపరేషన్ పెద్ద పులి’ : ట్రాప్ చేసేందుకు భారీ స్కెచ్ !

-

తెలంగాణలో కుమరం భీంలో గత కొద్ది రోజులుగా ఇబ్బంది పెడుతున్న పెద్దపులిని పట్టుకునేందుకు భారీ స్కెచ్ రెడీ చేశారు అటవీ శాఖ అధికారులు. విజ్ఞేశ్ ని చంపిన పులిని పట్టుకునేందుకు కసరత్తులు ముమ్మరం చేశారు. లేగదూడలను ఎరగా వేసి నాలుగు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. 35 మందితో 7 స్పెషల్ టీమ్స్ ని అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. 300 ట్రాప్ కెమెరాలతో అడవిని అణువణువునా జల్లెడ పడుతున్నారు ఫారెస్ట్ సిబ్బంది. అవసరమైతే పులికి మత్తు ముందు ఇచ్చి అయినా బంధించాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ పులి మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సిద్దాపూర్ గ్రామం వద్ద పెద్ద పులి సంచారం ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మత్తడి వాగు వద్ద నీరు తాగేందుకు పెద్దపులి వచ్చినట్లు గుర్తించారు. అయితే బెజ్జూర్ లో సంచరిస్తున్న పులి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. అయినా సరే సిద్ధాపూర్ వైపుకు పశువులని మేతకు తీసుకెళ్ళ వద్దని గ్రామస్థులకు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version