శక్తికి మారుపేరైన చిరుతపులి దాడి చేస్తే ఇక ప్రాణాలు వదులుకోవాల్సిందే. వెంటాడి, వేటాడి ఎలాంటి జంతువునైనా నిమిషాల్లో తనకు ఆహారం చేసుకుంటుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే క్రూర జంతువు చిరుతపులి. చెట్లను ఎక్కడం, పాకడం, నీటిలో ఈదడంలో ఇది ఆరితేరిన జంతువు. అయితే.. అలాంటి చిరుతకే ఆపద వస్తే ఎలా ? అవును చిరుతకు ఆపద వస్తే.. ఎవరూ కాపాడలేరు. తనకు తానుగానే ప్రమాదాల నుంచి బయటపడాలి. అయితే..తాజాగా అస్సాంలో ఓ చిరుత పులి బావిలో పడింది.
ఆ బావి లోతు ఏకంగా 20 అడుగుల లోతు. ఆ బావి గుండా వెళుతున్న చిరుత.. దురదృష్టవశాత్తుగా బావిలో పడింది. దాంతో..ఆందోళనకు గురైన చిరుత.. పైకి ఎక్కడానికి శతవిధాలా ప్రయత్నాలు చేసింది. తన బలమైన గొంతుతో అరుస్తూ… నరకయాతన అనుభవించింది. అయితే.. ఈ నేపథ్యంలోనే ఆ స్థానికులు.. ఆ చిరుత అరుపులు విన్నారు. విన్న ఆ స్థానికులు… చిరుత జాడ తెలుసుకుని.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. చిరుతను ఎట్టకేలకు బయటకు తీశారు. ఆ తర్వాత… అడవిలో వదిలేశారు అధికారులు. అయితే.. ఈ చిరుతను బయటకు తీసే రెస్క్యూ ఆపరేషన్ వైరల్ అయింది. బావిలోకి చాలా జాలిగా చిరుత పులి పైకి చూస్తున్న సన్నివేశం.. అందరిని కలిచివేసింది. మరికొందరు ఆ చిత్రాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరైతే…ఆ చిరుతకు సహాయం చేసినందుకు అధికారులను ప్రశంసించారు.