త్వరలోనే రాష్ట్రంలో కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం ఆమె అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..నూతన పంచాయతీల అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.ఇక1936లో ల్యాండ్ సర్వే చేశారని, ఆ తర్వాత ల్యాండ్ సర్వే జరగక గ్రామపంచాయతీలు రెవెన్యూ పంచాయతీలుగా మారలేదని అన్నారు. గ్రామ పంచాయతీలను రెవిన్యూ పంచాయతీలుగా మార్చేందుకు రెవెన్యూ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రతీ గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్లు, పారిశుధ్య కార్మికుల వేతనల కోసం రూ. 378.88 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. మారుమూల తండాల్లో రోడ్డూ, విద్యుత్ విద్యావ్యవస్థ లు సరిగా లేవని ఇతర వర్గాల ప్రజలతో సమానంగా మారు మూల తండాల ప్రజల జీవన పరిస్థితులను మెరుగు పరుస్తామని అన్నారు.అక్కడ రోడ్లు, విద్యుత్, విద్య వ్యవస్థలను చక్కదిద్దుతామని,త్వరలోనే బడ్జెట్ కేటాయింపులు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1851 ఆవాస గ్రామాలు, తాండాలులు, గ్రామ పంచాయతీగా మార్చబడ్డాయని తెలిపారు.