వాహనదారులకు శుభవార్త..ఇకపై అదనపు టోల్ భారం తగ్గే అవకాశం

-

వాహనదారులకు కేంద్ర శుభవార్త అందించింది. ఇకపై ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ వసూలు చేసేలా కొత్త విధానాన్ని కేంద్రం తీసుకురానుంది.ముందుగా ఎంపిక చేసిన జాతీయ రహదారులపై ఈ విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ప్రయోగాత్మకంగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రాథమికంగా అమలు చేయాలని రోడ్డు రవాణా,రహదారి మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ రాజ్యసభకు వివరించారు.

హర్యానాలోని NH-709లోని పానిపట్-హిసార్ సెక్షన్ లో ,కర్ణాటకలోని NH-275లోని బెంగళూరు-మైసూర్ సెక్షన్‌లో GNSS ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను పైలట్ ప్రాజెక్టుగా కేంద్రం తీసుకురానుంది. బుధవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానంతో తెలిపారు. వీటి ఫలితాల ఆధారంగా దేశంలో మిగతా రహదారులపై ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version