సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓ అద్భుతమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘టీమ్ ఇండియాలో అతడికి గొప్ప భవిష్యత్ ఉంది. అతడిలోని టెక్నిక్ అమోఘం అని అన్నారు. యశస్వీ జైస్వాల్లాగే మూడు ఫార్మాట్లలో రాణించగలడు. అతడిలో బ్రియాన్ లారా టెక్నిక్, స్టైల్.. యువరాజ్ ఫ్లెక్సిబిలిటీ, విధ్వంసం ఉన్నాయి. అభిషేక్ షాట్లను చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. త్వరలోనే అతడిని టీమిండియాలో చూడొచ్చు’ అని ఆయన అన్నారు.
కాగా, ఈరోజు అహ్మదాబాద్లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది.గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుంది. దూకుడు మీదున్న ఈ జట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ. ఇప్పటి వరకు 2జట్లు 26 సార్లు తలపడగా 17 మ్యాచుల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ నెగ్గింది.