నేడు హైదరాబాద్‌కు మహారాష్ట్ర మాజీ సీఎం..గ్రేటర్ బీజేపీ మేనిఫెస్టో విడుదల.

-

గ్రేటర్ ఎన్నికలను కమలం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..ఈ ఎన్నికల్లో సత్తా చూపిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ మరింత బలపడవచ్చనేది వ్యూహంగా కనిపిస్తోంది..పార్టీ జాతీయ నాయకత్వం కూడా గ్రేటర్ ఎన్నికల్ని చాలా సీరియస్‌గా తీసుకుంది..పార్టీ అగ్రనేతలు గ్రేటర్ ప్రచారంలో పాల్గొంటు,కార్యకర్తల్లో హుషార్ నింపుతున్నారు..రాష్ట్ర నేతలకు జాతీయ నేతలు కూడా తొడయ్యారు. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు రాష్ట్రానికి రాగా..రాబోయే రోజుల్లో అగ్రనేతలు గ్రేటర్ ఎన్నికల ప్రచారం లో పాల్గొనబోతున్నారు..ఇటీవలే జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక రిజల్ట్..దేశ వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ, ఉప ఎన్నికల ఫలితాలు కావచ్చు..బీజేపీలో ఉత్సాహం మరింత పెరిగింది..ఇదే ఉత్సహంతో గ్రేటర్‌లో పాగా వేయాలనే పట్టుదల పార్టీ నాయకత్వంలో పెరిగింది..ప్రచారంలో ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు కమలనాధులు..జాతీయ నేతలు రంగంలోకి దిగి ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇవాళ గ్రేటర్‌ మేనిఫెస్టో కూడా విడుదల చేయనుంది బీజేపీ.మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గ్రేటర్ బీజేపీ మేనిఫెస్టో ని విడుదల చేయడానికి వస్తున్నారు. ఇక 27న యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ దాస్ హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలో పాల్గొంటారు. 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేధావులతో సమావేశం అవుతారు. తర్వాత మల్కాజిగిరి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు 29 న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో రోడ్ షోలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version