బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తన సోదరుడి కూతురు వివాహానికి తప్పక రావాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్బంగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఇదిలాఉండగా, బీఆర్ఎస్ కీలక నేత తలసాని రేవంత్‌ను కలవడంపై ఇప్పటికే ఊహగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తలసాని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. దీనికి తోడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు త్వరలో హైదరాబాద్‌కు వస్తారని టాక్ వినిపిస్తోంది. ఆయన వస్తే బీఆర్ఎస్ కీలక నేతల పేర్లు బయటకు రానున్నాయి. దీంతో గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు సైతం పెరిగే చాన్స్ ఉంది. ఈ క్రమంలోనే తలసాని రేవంత్ ను కలిసి ఉండవచ్చని సైతం ప్రచారం జరుగుతోంది.