ఎట్టకేలకు తాడిపత్రి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలీసు భద్రతతో తాడిపత్రిలోని స్వగృహానికి వెళ్లిన పెద్దారెడ్డికు ఘన స్వాగతం పలికారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి పెద్దిరెడ్డి వెళ్లారు.

ఈ తరుణంలోనే…. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హారతి ఇచ్చి దిష్టి తీశారు కుటుంబ సభ్యులు. దీంతో తాడిపత్రి నియోజక వర్గంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.