కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా అరెస్ట్ అయ్యారు. గన్నవరం టీడీపీ ఆపీస్ దాడి కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. గన్నవరంలోని వంశీ ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి ఇవాళ సాయంత్రం గన్నవరం వచ్చారు.
హైదరాబాద్ నుంచి వేర్వేరు కార్లలో గన్నవరం వస్తు్న్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆయనను పోలీసులు ట్రాక్ చేశారు. వంశీ వేరే మొబైల్ నంబర్ ఉపయోగిస్తున్నాడని పోలీసులకు తెలిసిపోయింది. దీంతో వంశీ వాహనాన్ని పోలీసులు గమనించారు. వాహనాన్ని అనుసరించి ఇంటికి సమీపంలోనే అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ71గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది దాడికి ప్రోద్బలం ఇచ్చింది వల్లభనేని వంశీయేనని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో వంశీని ఈ కేసులో ఏ1గా మార్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.