తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారమే ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు తాజాగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఈ క్యాలెండర్ లో ప్రతీ సంవత్సరం ఏయే పోస్టులు ఎన్ని ఖాళీలున్నాయి.. నోటిఫికేషన్ ఎప్పుడూ..? ఎగ్జామ్ ఎప్పుడూ అనే వివరాలు ముందుగానే వెల్లడించనున్నారు.
ఇలా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో నిరుద్యోగులకు ఈ ఏడాదిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ జాబ్ రాకుండా నిరాశ చెందిన నిరుద్యోగులు మరుసటి ఏడాది అయినా జాబ్ వస్తుందనే ఆశతో ఉంటారని ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పోటీ పరీక్షలకు ఎక్కువ మంది కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు. ఇలా ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో.. ఎప్పుడు వాయిదా పడుతుందోనని నిరుద్యోగులు గందరగోళ పరిస్థితిలో ఉండే అవకాశముంది. జాబ్ క్యాలెండర్ విడుదలపై పలు పోటీ పరీక్షలకు సన్నద్దం అవుతున్న నిరుద్యోగులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.