ICMR: వ్యాక్సిన్ తీసుకున్న పదివేల మందిలో నలుగురు మాత్రమే కరోనా బారిన పడుతున్నారు…!

-

కరోనాని అదుపు చేయడంలో వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది. ఇదిలా ఉంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కరోనా వ్యాక్సిన్ కి సంబంధించిన విషయాలు చెప్పారు. ఇన్ఫెక్షన్ ని కట్టడి చేయడంలో వ్యాక్సిన్ విజయవంతమైందని కానీ కేవలం 0.04 శాతం మంది మాత్రమే మొదటి లేదా రెండో డోస్ తీసుకున్నా వైరస్ బారిన పడుతున్నారని అంటే పదివేల మందిలో ఇద్దరు నుంచి నలుగురు ఎఫెక్ట్ అవుతున్నారు అని అన్నారు.

కోవ్యాక్సిన్ మరియు కోవిషీల్డ్ కరోనా కోసం అడ్మినిస్ట్రేటర్ చేశారు. ఐసిఎంఆర్ చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇన్ఫెక్షన్ కి గురి అవుతున్నారని అంది. కానీ అటువంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు అని గమనించాలి. వ్యాక్సిన్ తీసుకున్నాక పదివేల మందిలో ఇద్దరు నుంచి నలుగురు మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నారని అంటున్నారు. అంటే వ్యాక్సిన్ తీసుకుని కరోనా బారిన పడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ.

ఇప్పటికీ 93 లక్షలు మంది కరోనా మొదటి డోసు తీసుకున్నారు. వీళ్లలో 4,208 మంది కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. అలానే 17 లక్షల మంది కరోనా సెకండ్ డోస్ కూడా తీసుకున్నారు. వాళ్ళల్లో 695 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది.

అదే కోవిషీల్డ్ ని అయితే 100 మిలియన్ మందు తీసుకోగా 17,145 మంది మాత్రమే ఈ కరోనా బారిన పడ్డారు. 1.5 కోట్ల మంది సెకండ్ డోస్ కూడా తీసుకోగా వాళ్ళల్లో 5,014 మంది కి పాజిటివ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version