ఉన్న కొద్ది ప్రతిరోజు ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న నేరాల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా ఒక నలుగురు అన్నదమ్ములు మీద రేప్ కేసు బుక్కయింది. ఒక 17 ఏళ్ల బాలిక మీద రేప్ చేయబోయారన్న ఫిర్యాదు అందడంతో నలుగురు అన్నదమ్ములు రేప్ కేసు రిజిస్టర్ అయింది. అక్టోబర్ 9న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ లేట్ గా నమోదయింది. నలుగురు అన్నదమ్ములు బాలిక ఇంట్లోకి జొరబడి అందులో పెద్ద వాడు ఆమె మీద రేప్ చేస్తుండగా మిగతా ముగ్గురూ తమ తమ సెల్ ఫోన్స్ లో ఈ ఘటనను బంధించడానికి ప్రయత్నించారు. అంతే కాక ఒకవేళ పోలీసుల వద్దకు వెళితే తాము చిత్రీకరించిన ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని కూడా ఆ నలుగురు కుటుంబాన్ని బెదిరించారు. అయితే బాలిక తండ్రి అదే రోజు పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని ఆయన ఆరోపిస్తున్నారు.
అంతేగాక ఈ నలుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు తన కూతుర్ని రోజు ఇబ్బంది పెట్టే వాడని, ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి దారి కాచి ప్రేమిస్తున్నాననే పేరుతొ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని ఆయన ఆరోపిస్తున్నారు. తాను ఆ అన్నదమ్ముల కుటుంబ వద్దకు వెళ్లి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకు వెళ్తే ఎదురు తన ఇంటి మీదకు వచ్చి ఇలా తన కూతురిని రేప్ చేయడానికి ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయం మీడియా వరకు చేరడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నలుగురు అన్నదమ్ములు మీద కేసు బుక్ చేశామని సెక్షన్ 354, 323, 452, 504, 506 అలాగే పోక్సో చట్టం కింద కూడా ఆ నలుగురు మీద కేసులు నమోదు చేసినట్లు లోకల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పేర్కొన్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే నిందితులను కఠినంగా శిక్షిస్తామని అని ఆయన పేర్కొన్నారు.