తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌..రాష్ట్రంలో మరో నాలుగు జాతీయ రహదారులు

-

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి మరో నాలుగు జాతీయ రహదారులను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అందులో ఒక దానిని నాలుగేళ్ల కిందట, మిగతా మూడింటిని గతేడాది జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. తాజాగా వాటి పనులు ప్రారంభించేందుకు అనుమతులు మంజూరు చేసింది.

వీటికి టెండర్లు పిలి చేందుకు జాతీయ రహదారుల విభాగం ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర రహదారులుగా ఇరుగ్గా ఉన్న ఈ రోడ్లు జాతీయ రహదారుల ప్రమాణాలకు అను గుణంగా.. అవసరమైన చోట్ల నాలుగు వరుసలుగా, మిగతా ప్రాంతాల్లో 10 మీట్లర్లు వెడల్పుగా మారనున్నాయి. అంటే.. 248.5 కిలో మీటర్ల పొడువు..10 మీటర్ల వెడల్పుతో నిర్మానం జరుగనుందన్న మాట. అలాగే.. దీని కోసం ఏకంగా… రూ.2431 కోట్లు ఖర్చు చేయనుంది కేంద్ర రవాణా శాఖ. ఈ మేరకు అధికారికం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఏడాదిలోపు ఈ పనులు పూర్తి కాను న్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version