ఉత్తర్ప్రదేశ్ మెయిన్పురిలో ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. ఇంట్లో నిద్రపోతున్న రిటైర్డ్ ఇన్స్పెక్టర్ దంపతులు సహా ట్రక్కులోని ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను క్రేన్ సహాయంతో వెలికితీశారు. ఘటనలో మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రక్కులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.