గుడ్ న్యూస్.. ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకునే ఛాన్స్… కొద్ది రోజులు మాత్రమే..!

-

మనకు వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ ఒకటి. ఇన్నో ఉపయోగాలు వున్నాయి ఆధార్ తో. బ్యాంకు లావాదేవీలు మొదలు సిమ్ కార్డులు తీసుకోవడం దాకా ఆధార్ తప్పక అవసరం. ఆధార్ కార్డు తీసుకుని 10 ఏళ్లు గడిచిన తర్వాత తప్పక అప్‌డేట్ చెయ్యాలి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..

10 ఏళ్లు గడిచిన తర్వాత అప్డేట్ చెయ్యాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటోంది. అయితే ఆధార్ ని అప్డేట్ చేసుకోవాలంటే కొంత ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఫ్రీగా అప్డేట్ చేయచ్చు అని గుడ్ న్యూస్ ని తీసుకు వచ్చింది. ఆధార్ కార్డు అప్‌డేట్ ని ఫ్రీగా చేసే అవకాశం ఇచ్చింది. ఉచితంగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకునేందుకు ఛాన్స్ ఇస్తోంది.

ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే ఇప్పుడు ఆధార్ ని అప్డేట్ చేసేయచ్చు. కానీ జూన్ 14, 2023 వరకు మాత్రమే ఈ అవకాశం వుంది. ఈ గడువు ముగిసిన తర్వాత మళ్ళీ చార్జెస్ పడతాయి. మైఆధార్ పోర్టల్ ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మార్చి 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు ఫ్రీ గా ఆధార్ ని అప్డేట్ చేసేసుకోవచ్చు. అయితే ఇది myAadhaar పోర్టల్‌లో మాత్రమే ఫ్రీ. ఒకవేళ ఆధార్ కేంద్రాలకు వెళితే మాత్రం రూ.50 చెల్లించాల్సిందే.

అప్డేట్ కోసం ముందు https://myaadhaar.uidai.gov.in/ లోకి లాగిన్ అవ్వండి.
ఆ తరవాత డాక్యుమెంట్ అప్‌డేట్ మీద నొక్కండి.
ఆధార్ నంబర్ ఇచ్చేసిన తరవాత రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
వివరాలు స్క్రీన్‌పై వస్తాయి. ఆ వివరాలు ని చెక్ చెయ్యండి.
అన్నీ ఒకే అయితే నెక్ట్స్ హైపర్ లింక్‌ పై క్లిక్ చెయ్యండి.
అడ్రస్, ఐడెంటిటీ ప్రూఫ్‌లను అప్‌లోడ్ చేసుకోవాలి.
ఇప్పుడు పీఓఏ, పీఓఐ డాక్యుమెంట్లు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ లో కనిపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version