SIR Movie : OTTలోకి ‘సార్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

-

కోలీవుడ్ హీరో ధనుశ్ ప్రధాన పాత్రలో.. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా సార్. సంయుక్త కథానాయిక. ఇప్పటికే థియేటర్‌లో విడుదలై ఈ మూవీ మంచి టాక్ సంపాదించుకుంది. థియేటర్​లో చూడటం మిస్ అయిన వారంతా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వీరి నిరీక్షణకు తెర పడింది.

సార్ మూవీ ఇవాళ్టి నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అందుబాటులో ఉంది. విద్యను అడ్డుపెట్టుకుని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కోట్లు ఎలా సంపాదించుకుంటున్నారో తెలియజేస్తూ.. ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని చూపిస్తూ ‘సార్‌’ చిత్రం తెరకెక్కింది. ప్రైవేటు కళాశాలలకు ఛాలెంజ్‌ విసురుతూ ఓ లెక్చరర్‌.. ప్రభుత్వ కళాశాల అభ్యున్నతికు ఎలా పాటుపడ్డాడు? అతడికి ఎదురైన సవాళ్లు ఏమిటి? వంటి ఆసక్తికర అంశాలతో ఇది తెరకెక్కింది.

ఈ సినిమాతో పాటు నెట్​ఫ్లిక్స్​లో ఇవాళ్టి నుంచి సార్‌/వాతి , కాట్‌ అవుట్‌: క్రైమ్‌, కరప్షన్‌, క్రికెట్‌ – ఇంగ్లీష్‌/హిందీ (డాక్యుమెంటరీ), కుత్తే – హిందీ సినిమా, ది మెజిషియన్స్‌ ఎలిఫెంట్‌ – ఇంగ్లీష్‌ సినిమా, నాయిస్‌ – మెక్సికన్‌ సినిమా, ఇన్‌ హిస్‌ షాడో – ఫ్రెంచ్‌ సినిమా, ఏజెంట్ ఎల్విస్ – ఇంగ్లీష్‌ సిరీస్‌ సీజన్‌ -1, స్కై హై : ది సిరీస్‌ – స్పానిష్‌ సిరీస్‌ సీజన్‌ -1, మ్యాస్ట్రో ఇన్‌ బ్లూ – గ్రీక్ సిరీస్‌ సీజన్‌ -1 , డ్యాన్స్‌ 100 – ఇంగ్లీష్‌ రియాల్టీ సిరీస్‌ అందుబాటులోకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version