ఉగాది నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు..?

-

ఉగాది నుంచి మహిళలకు ఏపీలో ఉచిత బస్సు సౌకర్యం అమలయ్యే అవకాశం ఉంది, సూపర్-6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే. ఈ అంశంపై సీఎం చంద్రబాబుతో ఉన్నతాధికారులు, మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఈరోజు చర్చించారు. సీఎం చంద్రబాబు కూడా పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అయితే ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని  ఆదేశాలు ఇచ్చారు. అలాగే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ పై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి 1లక్ష 80 వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. 2 లక్షల కు పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మౌలిక సదుపాయాల కల్పన పై అధికారులు దృష్టి పెట్టాలి అన్నారు. ఇక క్లీన్ ఎనర్జీ కి సంబంధించి వివిధ ప్రాజెక్ట్ ల వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం.

Read more RELATED
Recommended to you

Latest news