గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ , 6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని డిసెంబర్ 9, 2023న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.మహిళలు రాష్ట్రంలో ఎక్కిడి నుంచి ఎక్కడికైనా జీరో టికెట్ తీసుకొని బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహాలక్ష్మి’ పథకానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ పథకం అమలు అయినా నాటి నుండి 24.05 కోట్ల జీరో టికెట్స్ను జారీ చేసినట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ప్రతిరోజూ ఆర్టీసీ బస్సుల్లో 30.56 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నట్లు వెల్లడించింది.