పాకిస్థాన్ ప్రధాని ఎవరన్నదానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ పాక్ ముస్లింలీగ్ – నవాజ్ పార్టీ అగ్రనేత షెహబాజ్ షరీఫ్ రెండోసారి పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 8న జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో షరీఫ్ పార్టీ (పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్) రెండో స్థానంలో నిలిచింది. అయినా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సహకారంతో అధికారంలోకి వచ్చిన తర్వాత సోమవారం రాష్ట్రపతి భవనంలో ఆయన 33వ పాకిస్తాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా…పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్‌కు అభినందనలు’ అని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక దీనికి బదులిస్తూ ప్రధాని మోదీకి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ థ్యాంక్స్ చెప్పారు. ‘నేను ప్రధానిగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు’ అని ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.