విద్యార్ధులకి గుడ్ న్యూస్. ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే వాళ్ళు ఫ్రీ గా కోచింగ్ తీసుకోచ్చు. సర్కారు కాలేజీల్లోని చదివే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. దీనితో విద్యార్థులు మే చివరి వారం నుంచి ఫ్రీగా శిక్షణ తీసుకోచ్చు.
మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ ఈ శిక్షణ ఉంటుందని అధికారులు నిర్ణయించారు. ఆన్‌లైన్ క్లౌడ్ ఎడ్జ్ సంస్థ సహకారంతో ఉచిత శిక్షణ ఇస్తారు. 32 కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
మే 20,2022 లేదా మే 21, 2022వ తేదీ నుంచి ఈ ఫ్రీ కోచింగ్ అనేది ఉంటుంది. విద్యార్థులు tscie.rankr.io లింక్ ద్వారా ఇంట్లో ఉండి కోచింగ్ తీసుకోవచ్చు. అయితే మీరు మీ లక్షలను చేరుకోవాలి అంటే ఈ కోచింగ్ మీకు బాగా ఉపయోగ పడుతుంది.
చాలా మంది ఇప్పటికే కోచింగ్ తీసుకున్నారు. గత ఏడాది సైతం ఇదే తరహా శిక్షణ ఇవ్వగా రాష్ట్రంలో 20వేల మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం జరిగింది. వీళ్లల్లో 2,685మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంక్ సాధించారు. అలానే నీట్ కోచింగ్ పొందాలంటే ఎక్కడికీ వెళ్లాల్సిన పనే లేదు. ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు నీట్ ఎగ్జామ్ కు ఇంట్లో నుంచే ఉచితంగా కోచింగ్ మీరు పొందొచ్చు. Affinity Education App మీకు ఈ అవకాశం ఇస్తోంది.