కేకేఆర్ కి షాక్ ఇచ్చిన ముంబై..!

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ వాంఖడే స్టేడియంలో కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కేకేఆర్ కి ప్రారంభంలోనే పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. తొలుత టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ముఖ్యంగా తొలి ఓవర్ లోనే ఓపెనర్ సునీల్ నరైన్ ని ఔట్ చేశాడు బౌల్ట్. ఆ తరువాత దీపక్ చాహర్ బౌలింగ్ డీకాక్ ఔట్ అయ్యాడు. అశ్వని కుమార్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడం డీకాక్ వెనుదిరిగాడు.

మరోవైపు కెప్టెన్ అజింక్యా రహానే ను అశ్వని కుమార్ ఔట్ చేశాడు. అలాగే రింకు సింగ్ ను కూడా ఔట్ చేశాడు. రఘువన్షీని కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. అదేవిధంగా వెంకటేష్ అయ్యను దీపక్ చాహర్ ఔట్ చేయడంతో వరుసగా కేకేఆర్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మనీష్ పాండే తొలి బంతికే సిక్స్ తో ప్రారంభించాడు. ప్రస్తుతం 10.3 ఓవర్లలో 74 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది కేకేఆర్ జట్టు. ప్రస్తుతం మనీష్ పాండే క్రీజులో ఉన్నారు. కేకేఆర్ తక్కువ స్కోరు కే పరిమితమయ్యేలా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version