ఆ దేశం వెళ్లేందుకు విమాన టికెట్లు ఉచితం.. వచ్చే ఏడాది నుంచే ప్రారంభం..!

-

ఇతర దేశాలకు వెళ్లాలంటే.. విమానం ఎక్కాల్సిందే.. ఈ విమానం కాస్ట్‌ ఏమన్నా తక్కువ ఉంటుందా అంటే.. వేలల్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి దిల్లీ వెల్లడానికే.. ఆరువేలు పైనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటిది దేశం దాటాలంటే.. కానీ మీరు ఈ దేశం వెళ్లాలంటే.. ఫ్లైట్‌ టికెట్‌ ఫ్రీ.. వాళ్లే టికెట్‌ తీసి మరీ ఆహ్వానిస్తారు. సరదాగా ఏదైనా ట్రిప్‌ ప్లాన్ చేస్తే ఓ సారి ఈ దేశం వైపు చూడండి. ఎలాగూ విమానం ఖర్చులు ఉండవు కాబట్టి..!

కరోనా తర్వాత టూర్లు వెళ్లడమే మానేశారు. దీంతో ప్రపంచంలో ప్రసిద్ధిగల పర్యాటక ప్రాంతాలు సైతం సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి. దీంతో తమ దేశాలకు పర్యాటకులను ఆకర్షించేందుకు ఎన్నో ఆఫర్లను ఇస్తున్నారు. ఇటీవల ఇటలీలోని ఫ్రియులి వెనిజియా గియులియా ప్రాంతానికి చెందిన అధికారులు కూడా.. తమ ప్రాంతానికి పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించారు. అతి తక్కువ మంది పర్యాటకులు సందర్శించిన ప్రాంతంగా ఇటలీలోని ఫ్రియులి వెనిజియా గియులియా నగరం నిలిచింది. దీంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రబావితం కావడంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు అక్కడి యంత్రాంగం పర్యాటకులకు అనేక ఆఫర్లను ప్రకటించింది.

ఫ్రియులి వెనిజియా గియులియా నుంచి వెన్నిస్​ మినహా.. ఇటలీలోని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. రీజనల్​, ఇంటర్​సిటీ లైన్స్​ నుంచి హై స్పీడ్​ లైన్స్​ వరకు..ఏ ట్రైన్​లోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చు అని పర్యాటకులకు ఆఫర్లు ప్రకటించింది. సందర్శకుల రైళ్ల ఖర్చులు తామే భరిస్తామని అధికారుల తెలిపారు.. ఇప్పుడు ఇదే ఆఫర్‌ హాంకాంగ్‌ కూడా ప్రకటించింది.

తమ దేశంలో పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి, పర్యాటకులను ఆకర్షించడానికి 5,00,000 విమాన టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది. అలాగే కరోనా తర్వాత హాంకాంగ్‌కు వచ్చే పర్యాటకులకు కఠిన నిబంధనలు అమలుచేస్తుండగా.. తాజాగా ఆ నిబంధనలన్నింటిని సడలించింది. కొవిడ్ తర్వాత హాకాంగ్‌లో పర్యాటకం పూర్తిగా దెబ్బతింది. దీంతో తిరిగి పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు హాంకాంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

తమ దేశానికి వచ్చే పర్యాటకులకు 5,00,000 విమాన టికెట్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు వెల్లడించింది. ఈ టిక్కెట్లను వచ్చే ఏడాది పంపిణీ చేస్తామని తెలిపింది ఈ ఉచిత టికెట్ల ధర సుమారు $ 254.8 మిలియన్లు ఉండొచ్చు..విమానయాన పరిశ్రమకు సహాయం అందిచడానికి ఉచిత విమాన టిక్కెట్ల పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపింది..

ఉచిత విమాన టికెట్ల నిర్ణయంతో హాంకాంగ్ పర్యాటక రంగం ఆదాయాన్ని అర్జించడంతో పాటు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని హాంకాంగ్ ఆశాభావంలో ఉంది. కోవిడ్ నిబంధనల కారణంగా హాంకాంగ్‌కు వచ్చేవారు తమ సొంత ఖర్చులతో హోటల్ గదిలో 21 రోజుల క్వారంటైన్ గడపాల్సి ఉండేది. ఆ తర్వాత ఈ వ్యవధిని 7 నుంచి 3 రోజులకు తగ్గించారు. తాజాగా సెప్టెంబర్ 26 నుంచి ఈ విధానాన్ని కూడా రద్దు చేశారు. అయితే హాంకాంగ్‌కు వచ్చే పర్యాటకులు విమాన ప్రయాణానికి ముందు వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్, కొవిడ్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాలని మాత్రం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version