ఉచిత నీటి మార్గదర్శకాలు ఇవే..

-

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వ ఇచ్చిన భాగ్యనగరంలో ఉచిత నీటి హామీ త్వరలో నెరవేరబోతుంది. అందుకు సంబంధించిన అధికారులతో చర్చలు జరిపి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉచితనీటి పథకానికి ‘ఆధార్‌’ను ప్రామాణికం చేసింది. బస్తీలు, గల్లీలో నల్లాలకు మీటర్లు లేకున్నా డాకెట్‌ ఆధారంగా బిల్లులు వసూలు చేయనున్నారు. కానీ.. అపార్ట్‌మెంట్లు పెద్దపెద్ద భవనాలు, లాడ్జీలు, హోటళ్లలో తప్పనిసరిగా మీటర్‌ ఉండాలనే నిబంధన పెట్టారు. ఈ పథకం ద్వారా అందిస్తున్న ఉచిత నీటి వినియోగం 20వేల లీటర్లు దాటితే ఇప్పుడు చెల్లిస్తున్న దాని ప్రకారం బిల్లులు వసూలు చేస్తారు.

 

20వేల లీటర్లు..

అయితే.. మురికివాడలు, బస్తీ ఏరియాల్లో ఉన్న నల్లాలకు మాత్రం పూర్తిగా బిల్లులు రద్దు చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా మీటర్లు అమార్చాల్సిన అవసరం లేకున్నా ఈ పథకం వర్తింపజేస్తారు. డొమాస్టిక్‌ యూజర్లు మాత్రం 20వేల లీటర్ల ఉచిత నీటిని పొందాలంటే వారు తప్పని సరిగా మీటర్లు బిగించుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. మీటర్లకు అయ్యే ఖర్చులను కూడా ఎవరికి వారే చెల్లించుకోవాలని జలమండలి యంత్రాంగం పేర్కొంది. కాగా అపార్ట్‌మెంట్‌ వాసులకు జలమండి ఓ వెసులుబాటు కల్పించింది. అయితే అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఒక్కోఫ్లాటుకు 20 వేల లీటర్ల నీరు అందిస్తుండగా ఒకవేళ 10 ఫ్లాట్లు ఉన్న అపార్ట్‌మెంట్‌కు దాదాపుగా 2 లక్షల లీటర్ల ఉచిత నీరు అందించనున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లకు మీటర్లు బిగించి ఎంత నీటి వినియోగం అవుతుందోనని ట్రాయల్‌ రన్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version